Header Banner

ఏపీలో EAPCET 2025 ఎగ్జామ్స్ షురూ! ఎప్పటి వరకు అంటే ?

  Tue May 20, 2025 08:28        Education

ఆంధ్రప్రదేశ్‌లో AP EAPCET 2025 పరీక్షలు మొదలయ్యాయి. ఈ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టును రాష్ట్ర ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జేఎన్‌టీయూకే నిర్వహిస్తోంది. ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలను ఈ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏపీలో 143, తెలంగాణలోని హైదరాబాద్‌లో 2 కేంద్రాల్లో ఈరోజు నుంచు పరీక్షలు ప్రారంభం అవ్వగా.. 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

 

ఈఏపీ సెట్‌ ఎగ్జామ్స్ ను రెండు సెషన్లలో నిర్హిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్‌.. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు మరో సెషన్‌లో పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రంలోకి గంటన్నర ముందుగా మాత్రమే అనుమతిస్తున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు నిర్దేశించిన గుర్తింపు కార్డు, నలుపు, నీలం రంగు బాల్‌ పాయింట్ పెన్నును మాత్రమే ఎగ్జామ్ హాల్ లోకి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా హాజరైనా ఎగ్జామ్ కి అనుమతించడం లేదు.


ఇది కూడా చదవండి: ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ! ఆ మూడు డిమాండ్లపై..

 

అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షలు మే 19, 20 తేదీల్లో.. ఇంజినీరింగ్‌ పరీక్షలు మే 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్ష ప్రాథమిక "కీ" ని మే 21వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అలానే ఇంజినీరింగ్‌ ఎగ్జామ్ ప్రాథమిక "కీ"ని మే 28వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఫైనల్‌ కీని జూన్‌ 5వ తేదీన ప్రకటిస్తామని అధికారులు అనౌన్స్ చేశారు. ఫలితాలు విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.


ఇక ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం మొత్తం 3,62,448 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్‌కు 2,80,612 మంది.. అగ్రికల్చర్‌ ఫార్మసీకి 81,836 దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికీ దరఖాస్తు చేసుకున్న వారు 912 మంది ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #APEAPCET2025 #EAPCET2025 #APEAMCET #APCET2025 #EngineeringEntrance #APStudents